Take a fresh look at your lifestyle.

ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి అనువైన భూమికి ఇస్తానన్న రైతు భరోసా ఎక్కడ ?

  • తాటికొండ సీతయ్య మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు.

తుంగతుర్తి, ముద్ర: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 31నాటికి వ్యవసాయానికి పనికి వచ్చే మొత్తం సాగు భూమికి రైతు భరోసా ఇస్తామని హామీయిచ్చి 3ఎకరాలు దాటి ఇవ్వలేదని మరి సాగు భూమికి రైతు భరోసా ఎక్కడని అని మాజీ ఎంపీపీ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు.బుధ వారం తుంగతుర్తి మండలం సంగం గ్రామం లో ఎండిన పంటలు పరిశీలించిన అనంతరం రైతు భరోసా రాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడారు ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ అధికారం కోసం అబద్దాలా వాగ్దానాలు చేసి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు.ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని అసెంబ్లీ లో నిలదీస్తున్న బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం కాలం గడుపు తున్నారని అన్నారు.ఇలాంటి అబద్దాల ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తగిన శాస్తి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండాగానీ రాములు గౌడ్,మండల నాయకులు కడారి దాసు,మట్టిపల్లి వెంకట్ మల్యాల రాములు,గ్రామ అధ్యక్షులు జటంగి రవి,బొల్లెడ్డు శ్రవణ్,కలకోట్ల ఎలైజర్మా, జీ ఎంపీటీసీ మల్యాల వెంకన్న,రమేష్,మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.