Take a fresh look at your lifestyle.

పశువుల అక్రమ రవాణా నియంత్రనకు చెక్ పోస్ట్ లు

  • జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : పశువుల అక్రమ రవాణాను నిరోధించడానికి జగిత్యాల జిల్లాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి నిరంతరగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ చెక్‌పోస్టుల లో 24 గంటలూ నిరంతర నిఘాలో ఉంటాయనీ, పోలీసు శాఖ, పశుసంవర్ధక శాఖ సిబ్బంది షిఫ్టుల వారీగా సమన్వయంతో పనిచేస్తారని ఎస్పీ వివరించారు.పశువుల రవాణా అనేది నియమ నిబంధనల ప్రకారమే జరగాలని, అనుమతి పత్రాలు లేకుండా ఆవులు, దూడలను రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు.పశువులను రవాణా చేసే ప్రతి వాహనంతో చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరిగా ఉండాలనీ, ఎవ్వరు తమ ఆధారాలు లేకుండా రవాణాలో పాల్గొనరాదని సూచించారు.వ్యక్తి, సంస్థ స్వయంగా వాహనాలను ఆపకూడదనీ, ఈ విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఎవరైనా అనుమానాస్పద రవాణా గమనించిన పక్షంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ సూచించారు.అదేవిధంగా సోషల్ మీడియాలో ద్వేషపూరిత, రెచ్చగొట్టే, అసభ్యకరమైన పోస్టులు పెడితే, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మీడియా మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.