ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తనిఖీ చేశారు.
గురువారం భువనగిరి లోని టైమ్స్ కళాశాల, భువనగిరి లోని శ్రీ చైతన్య కళాశాల లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయా అనే అంశంపై అదనపు కలెక్టర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రశ్నాపత్రాల పంపిణీ విధానం తదితర అంశాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పని తీరు, తాగునీరు, విద్యుత్, కూర్చునే ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇన్విజిలేటర్లు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి మాల్ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం పరీక్షలను నిర్వహించాలని, విద్యార్థులందరూ ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post