భరత్ చంద్రా చారి కుటుంబానికి ఇదిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రా చారి ని గతంలో దత్తత తీసుకున్న కలెక్టర్.
ప్రతి నెల అతని చదువుకు ఆర్ధిక భరోసాని 5000 రూపాయలు ఇస్తూ వారి కుటుంబానికి నెల వారి సరుకులను అందిస్తున్నారు. భరతచంద్ర చారి కుటుంబం నివసించడానికి ఇల్లు లేకపోవడం, వారు ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకొని ఉండటానికి ప్రభుత్వం తరుఫున 225 గజాల ఇంటి స్థలాన్ని మంజూరు చేయించడంతో పాటు గురువారం ఇందిరమ్మ ఇంటికి కూడా భూమి పూజ చేశారు.

భరత్ కి ఎల్లవేళల అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.భరత్ నాకు ట్రాన్స్ఫర్ అయినది అని కలెక్టర్ భరత్ కి చెప్పారు.అయినా నీకు ఏం ఇబ్బంది వచ్చిన నన్ను సంప్రదించాలని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు నాణ్యతతో వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి , ఎంపీడీఓ, సబ్ ఇన్స్పెక్టర్, ఎంపీవో, పంచాయత్ సెక్రటరీ , సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు