ముద్ర, యాదగిరిగుట్ట :
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ అరాచకానికి బలైపోయిన బాలిక రక్షణను సీఎం రేవంత్‌రెడ్డి గాలికొదిలేశారని బీఆర్‌ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్ళెం స్వాతి విమర్శించారు. ప్రధాని మోదీ పర్యటనపై ఉన్న శ్రద్ధ బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో లేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. పోక్సో కేసులో 24గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేస్తారు.. కానీ భగీరథ్ విషయంలో మూడు నాలుగు రోజులైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లలేదు అన్నారు. సామాన్యులకో చట్టం..? కేంద్రమంత్రి కొడుక్కో చట్టమా అంటు ప్రశ్నించారయ. ఈ విషయంలో సీఎం రేవంత్, మంత్రులు ఎందుకు స్పందించడం లేదన్నారు. కేంద్ర మంత్రి కొడుకు కావడం వల్లే మాట్లాడడం లేదనీ.. మహిళకు కల్పించే భద్రత ఇదేనా అన్నారు. సంజయ్ కూడా తన నిజాయితీని నిరూపించుకోవాలని.. కేంద్ర మంత్రి పదవితో పాటు ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.