మధిర, ముద్ర విలేఖరి : వైరాలో ఈ నెల 24న జరగనున్న టియు డబ్ల్యూజె, ఐజెయు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు కోరారు. శనివారం స్థానిక రెడ్డి గార్డెన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలపై టియుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు చేసి జర్నలిస్టుల హక్కులను సాధించామని ఆయన గుర్తు చేశారు. టియు డబ్ల్యూజె పోరాటాల ఫలితంగానే గ్రామీణ ప్రాంత విలేకరులకు అక్రిడేషన్ వచ్చినట్లు తెలిపారు.ఈ మహాసభలో జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. వైరాలో జరిగే టియు డబ్ల్యూజే ఐజెయు జిల్లా మహాసభలకు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ హాజరు కానున్నారని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు పాగి బాలస్వామి, టి కె ప్రసన్నన్, కాకరపర్తి శ్రీనివాసరావు, మధు, రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.