Take a fresh look at your lifestyle.

‘పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం’

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,టిపిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక సూపర్ బజార్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిన నూతన రేషన్ కార్డులను ఈ నెల 21 సోమవారం మందమర్రి లోని సాయి మిత్ర గార్డెన్లో కార్మిక శాఖ మంత్రి,చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రామకృష్ణాపూర్ పట్టణంలో సుమారు 1500 కొత్త రేషన్ కార్డులలో తొలి విడతలో భాగంగా 650 కార్డులను అందించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో గాండ్ల సమ్మయ్య,పుల్లూరి కళ్యాణ్,గండి కుమార్ గౌడ్,కట్ల రమేష్,కుర్మ సురేందర్,సంఘ రవి, పుష్ప, రాజేశ్వరి, సునీత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.