Gangula Kamalakar son wedding : హైదరాబాద్‌లో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వివాహ వేడుక ఘనంగా జరిగింది. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహం శనివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా వివాహ వేడుకలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఆయనకు గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వధూవరులను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు.

చిరంజీవి రాకతో వివాహ వేడుకలో సందడి మరింత పెరిగింది. ఆయనను చూసేందుకు అతిథులు ఆసక్తి కనబరిచారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.