కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ ను తీసుకువచ్చి హడావిడి చేసినదంతా వట్టిదేనా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంపు యార్డ్ తో హుజూరాబాద్ ప్రజలను ఇబ్బందులు పెట్టాలని ఎందుకు అనుకుంటారు
అవసరమైనప్పుడల్లా బీజేపీకి బీఆర్ఎస్,బీఆర్ఎస్ కు బీజేపీ రెండు పార్టీలు సహాయం
కార్పోరేషన్ కో ఆప్షన్ ఎన్నిక ద్వారా మరొకసారి రుజువయ్యింది
బండికి బ్లాస్టింగ్ న్యూస్ మాట్లాడాలన్న దాని పై ఉన్న శ్రద్ధ కరీంనగర్ అభివృద్ధి పై లేదు
హుజూరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డంప్ యార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు..
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ముద్ర, కరీంనగర్ :
బీజేపీ,బీఆర్ఎస్ రెండు పార్టీలు కరీంనగర్ లో ఎల్లప్పుడూ సహకరించుకుంటాయని ఆది నిన్నటి మున్సిపల్ కార్పోరేషన్ కో ఆప్షన్ ఎన్నికతో మరొకసారి రుజువయ్యిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డంపు యార్డు సమస్య పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కు భాధ్యత లేదా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. సంవత్సరం క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను తీసుకువచ్చి డంపు యార్డు మరియు ఇతర సమస్యలకు సర్వరోగ నివారిణిని తీసుకువచ్చానని హడావిడి చేసి స్మార్ట్ సిటీ పనులకు అట్టహాసంగా ప్రారంభోత్సవాలు చేసి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అన్ని పనులు జరిగిపోయినట్టు ప్రజలకు భ్రమలు కల్పించారని ఇప్పుడేమో భాధ్యత లేనట్టు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు జంతువుల కళేబరాలు వేస్తామని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అందరి క్షేమం కోరుకునేవారని డంపు యార్డు విషయంలో కూడా బీజేపీ,బీఆర్ ఎస్ నాయకులు ఒక్కటై హుజురాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా రక రకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నాడని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.ఇప్పటికైనా బండి సంజయ్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టించడం మాని కేంద్రం ద్వారా ఏవిధమైన సహకారం లభిస్తుందో చూడాలని రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉందని అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎండి తాజ్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,కార్పోరేటర్లు వరాల నర్సింగం,పర్వతం మల్లేశం,కాంతాల జగన్ రెడ్డి నాయకులు దండి రవీందర్,ఇట్టెపు వేణు,మ్యాకల నర్సయ్య,జీడి రమేష్,వంగల విద్యాసాగర్,నాగుల సతీష్ హనీఫ్,ఉప్పరి అజయ్,ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.