ముద్ర ప్రతినిధి, మెదక్:
జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా
సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 86 కేసుల్లో ₹27,57,454 మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయడం జరిగిందని ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు తెలిపారు. ఐపీసీ, బిఎన్ఎస్, ఎస్.ఎల్.ఎల్ 485 కేసులు సైబర్ క్రైమ్ 86 కేసులు, ఈ-పెట్టి కేసులు 90 కేసులు, డీ.డి, ఎంవీ యాక్ట్ 527
ఈ కేసుల్లో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చినట్లు పేర్కొన్నారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ ఒక మంచి అవకాశం అని పేర్కొన్నారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులకు గురిచేయకూడదని సూచించారు. రాజీ మార్గమే రాజమార్గం అని, రాజీ కుదుర్చుకునే అవకాశం ఉన్న అన్ని కేసుల్లో ఇరు వర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో డి4సి కేంద్రాలను ఏర్పాటు చేసి, డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తున్నట్లు తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
జిల్లా పోలీసు కార్యాలయం
మెదక్ జిల్లా
బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో ఎవరైనా క్రికెట్ లేదా ఇతర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు హెచ్చరించారు.
ఇటీవల కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. యువత బెట్టింగ్‌ల వైపు వెళ్లి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా వారు మొబైల్ ఫోన్ వినియోగం, ప్రవర్తనను గమనించాలని, అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే స్పందించాలని తెలిపారు.
జిల్లాలో బెట్టింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఆధునిక సాంకేతికతతో పాటు టాస్క్‌ఫోర్స్, ప్రత్యేక బృందాల సహకారంతో నిఘా పెంచుతున్నామని పేర్కొన్నారు.
జిల్లాలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్‌లపై సమాచారం ఉన్నవారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100, అలాగే జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.