Take a fresh look at your lifestyle.

రైతుల అభివృద్ధికి బ్యాంకులు దోహద పడాలి

  • రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
  • అడసర్ల పాడు, కందుకూరులో డీసీసీబీ బ్రాంచిల ప్రారంభం.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం : రైతుల అభివృద్ధికి బ్యాంకులు తమ వంతు సహకారం అందించి దోహద పడాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బుధవారం ఆయన వేంసూర్ మండలంలోని అడసర్ల పాడు, కందుకూరు గ్రామాల్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన బ్రాంచిలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి బ్యాంకులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.పంట రుణాలతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి దోహద పడే విధంగా వ్యవసాయ టర్మ్ లోన్స్ కూడా ఇవ్వాలన్నారు.వ్యవసాయ సంబంధిత రంగాల అభివృద్ధికి నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు రుణాలను పంపిణీ చేయాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచే సిన సహకార బ్యాంక్ బ్రాంచీలు స్థానిక రైతాంగానికి మేలు చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే రైతు భరోసా, ధాన్యం కొనుగోలు, బోనస్, పంట నష్ట పరిహారం వంటి పథకాలను సమర్ధవంతంగా సకాలంలో అమలు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, డిసిసిబి డిజిఎం వేణుగోపాల్ రావు, సర్వేశ్వర్ రావు, ఏజిఎం చందు రావు, మేనేజర్లు నాగలక్ష్మి, రజిత, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.