ముద్ర పెబ్బేరు
శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ వారి తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయులు యూసుఫ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హాస్పటల్లో అడ్మిట్ అయి చికిత్స పొంది ఇటీవలే ఇంటికి చేరుకున్నారు.

ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వారి ఇంటికి చేరుకొని పరామర్శించారు.ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు పండ్లు ఫలహారాలు తినిపించారు. ఈ ఏడాదిలో ఉగాది రంజాన్ పండుగలు ఒకేసారి రావడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జగన్నాథం నాయుడు, ఉప సర్పంచ్ కళ్యాణ ఖారి ఖాజా, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి, పర్వతాలు, విష్ణుసాగర్, శివసాగర్ ,వెంకటేష్, షఫీ, సయ్యద్ ,గౌడ నాయక్ ,సుదర్శన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.