Take a fresh look at your lifestyle.

ఆహ్లాదంగా ఆత్మీయ సమ్మేళనం

  • 47 ఏళ్ల తర్వాత కలిసిన టెన్త్ బ్యాచ్ – కుర్రాళ్లలా డాన్సులు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: 1978లో ఒకే స్కూల్ లో టెన్త్ వరకు చదువుకున్న ఆ మిత్రులు 47 ఏళ్ళ తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడంతో వారి ఉత్సాహానికి అవధులు లేవు,ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం,కుర్రాళ్లలా డాన్సులు చేయడం, ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకోవడంలో నిమగ్నమయ్యారు.1978 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆహ్లాదకరంగా సాగింది.కామారెడ్డి జెడ్పిహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల పదవ తరగతి బి సెక్షన్ విద్యార్థులు ఆదివారం బేసిక్ లోని ఫార్మ్ హౌస్ లో కలిశారు.ఈ సందర్బంగా గడిచిన తీపి జ్ఞాపకాలను నెమరువేసుకొని తమ తమ అనుభవాలు, అనుబంధాలు,యోగ క్షేమాలు పరస్పరం పంచుకున్నారు.తమ తరగతి గదిలో జరిగిన సంఘటనలు,ఉపాధ్యాయుల బోధనా తీరు తెన్నులు తమదైన శైలిలో ఆవిష్కరించి సంతోషంతో ఊగి పోయారు.ఆటా పాటలతో ఆనందమైన క్షణాలు గడిపారు. ఈ బ్యాచ్ లోని మిత్రులు ఉన్నత స్థానంలో ఉన్నా,స్థాయిని మరిచి గెంతులేశారు.ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆనాటి మిత్రులైన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆర్. శ్రీధర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ బంధం భూమయ్య, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ రిటైర్డ్ సీనియర్ మేనేజర్ సునీల్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు చాట్ల రాజేశ్వర్, పాత బాల్ కిషన్, ట్రాన్స్కో రిటైర్డ్ ఈఈ రామలింగం, ప్రముఖ వ్యాపారులు కోడిప్యాక బాలరాజ్ గౌడ్, పార్సి మధుసూదన్, వెంకటరమణ, కస్వ వెంకటేశం, ముప్పారపు రాజేందర్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ భీమ్ రావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిటైర్డ్ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గోజె గంగాధర్, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ జి. రమేష్, ఎన్ ఎల్ సి ఐఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ చిట్టి మధు, సీనియర్ జర్నలిస్ట్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.