Take a fresh look at your lifestyle.

ఎడ్యుకేషన్ హబ్ గా జగిత్యాల: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రం ఎడ్యుకేషన్ హబ్ గా మారింది అని విద్య అభివృధి కి తన వంతుగా కృషి చేస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో కలిసి పని చేస్తున్న సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయటం పట్ల ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పూర్తయిన నర్సింగ్ కళాశాలను ప్రారంభించడానికి కృషి చేయటం జరిగిందని, 2018 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గత ముఖ్యమంత్రిని కోరి మెడికల్ కాలేజి సైతం సాధించుకున్నామన్నారు.మెడికల్ కాలేజి నిధుల మంజూరుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహని వారి కార్యాలయంలో కలిసి నిధుల మంజూరుకు కృషి చేయాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.రాయికల్ మండలంలో కస్తూర్బా పాఠశాలకు 4 కోట్లతో నూతన భవనం మంజూరు అయిందని అన్నారు. 5 కోట్ల తో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ స్కిల్ యూనివర్సిటీ అనుబంధంగా టి ఆర్ నగర్ లో ఏర్పాటు చేస్తున్నాం అని పనులు జరుగుతున్నాయని అన్నారు.రేవంత్ రెడ్డి సర్కార్ లో ప్రభుత్వం ఏర్పడగానే అమ్మ ఆదర్శ పాఠశాలలు మౌలిక సదుపాయాలకు నిదులు మంజూరు చేశారని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం లో రెసిడెన్షియల్ పాఠశాలలు బీసీ ఎస్సీ మైనార్టీ అద్దె భవనంలో ఉండగా చాలా ఇబ్బందిగా ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా లో నూతన భవనాలు మంజూరు చేశారని 200 కోట్ల తో జగిత్యాల చల్ గల్ వాలంతరీ కేంద్రం లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని బడ్జెట్ సైతం విడుదల చేయటం జరిగిందన్నారు. జగిత్యాల నియోజకవర్గం లో విద్య అభివృధి కోసం ఎల్లప్పుడూ తన వంతుగా కృషి చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారం తో అభివృద్ధి చేస్తా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.