Take a fresh look at your lifestyle.

సింగరేణి జలసింధువు కోసం మేడిపల్లి ఓసిపి పరిశీలన

ముద్ర ప్రతినిధి గోదావరిఖని: ఇటివలే సింగరేణి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ “సింగరేణి నీటిబిందువు – జల సింధువు”విశిష్ట కార్యక్రమం సింగరేణి వ్యాప్తంగా 50 మినీ చెరువుల ఏర్పాటు,అభివృద్ధి భూగర్బ జలాల పెంపుదలకు ప్రత్యేక ప్రణాళిక నీటి కుంటలుగా మూత పడిన ఓ.సి.సంపులు ఓవర్ బర్డెన్ గుట్టల మధ్య నీటి తటాకాలు ఏర్పాటు,సహజ చెరువులు,కుంటల్లో నీటి నిల్వకు చర్యలు జీవావరణ వృద్ధికి, జలచరాలు,పశుపక్ష్యాదుల పెరుగుదలకు చేపట్టటం జరిగింది. ఇందులో భాగంగా బుధవారం అర్జీ 1 ఏరియా జిఎం డి.లలిత్ కుమార్ ఆదేశాల మేరకు మూత పడిన మేడిపల్లి ఉపరితల గని పరిసర ప్రాంతాలలో సుమారు 6.26 హెక్టార్ల విస్తీర్ణంలో 7 ట్యాంకుల నిర్మానం కోసం అనువైన స్థలాలను అధికారుల బృందం తో కలిసి పరిశీలించారు.త్వరలో గుర్తించబడ్డ ప్రదేశాలలో వాటర్ ట్యాంక్ లను ఏర్పాటు చేయటం జరుగుతుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో యస్ఓటు జిఎం గోపాల్ సింగ్,ఎన్విరాన్ మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్,ఎస్.సి సివిల్,వర వరప్రసాద్,ఏరియా సెక్యురిటి అధికారి వీరారెడ్డి,మేనేజర్ మల్లిఖార్జున్ యాదవ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.