Take a fresh look at your lifestyle.

బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఓటర్లను కోరారు. ఆదివారం పట్టణంలోని 𝟮𝟴వ వార్డు అభ్యర్థి గుమ్మల సరిత మల్లేశం, 𝟮𝟰వ వార్డు కొలుపుల హరిప్రియ కమలాకర్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు రాకల శ్రీనివాస్, పట్టణ మండల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.