ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్యాధికారి డా. జానకిరామ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా డా. జి.వి. రమేష్, రీజినల్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువైద్య సేవల ప్రాముఖ్యతను వివరించి, పశువుల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
పశువులలో వ్యాధుల నివారణకు సమయానికి టీకాలు వేయించడం అవసరమని తెలియజేస్తూ, రైతులు అనుసరించాల్సిన ఆధునిక పశుసంవర్థక పద్ధతులపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలను మరింత విస్తరించి రైతులకు చేరువ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు.
ఇంకా వారు మాట్లాడుతూ పశుసంవర్థక రంగం అభివృద్ధి చెందితే రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు దేశ ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పశువైద్యులు, సిబ్బంది, పశుసంవర్థక శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.