Take a fresh look at your lifestyle.

58 అభ్యంతరాలు.. 110 దరఖాస్తులు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఇటీవల క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హుల జాబితాను మున్సిపాలిటీ కార్యాలయ గోడపై ఉంచిన విషయం అందరికి తెలిసిందే.విడుదల చేసిన జాబితాలో అభ్యంతరాలు తెలిపేందుకు అధికారులు పది రోజుల పాటు ప్రజలకు అవకాశం కల్పించారు.కాగా అర్హుల జాబితాలో అనర్హులను అర్హులుగా చేశారంటూ,అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్ఏస్ పార్టీకి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు అర్హులైన లబ్ధిదారులతో కలిసి అభ్యంతరాలు తెలిపారు. అర్హుల జాబితాపై 58 మంది అభ్యంతరాలు తెలుపగా,110 కొత్త దరఖాస్తులు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు “ముద్ర ప్రతినిధితో” సోమవారం చెప్పారు.సంబంధించిన దరఖాస్తులను మందమర్రి ఎమ్మార్వో కార్యాలయానికి తరలించామన్నారు.

Leave A Reply

Your email address will not be published.