Take a fresh look at your lifestyle.

కార్మికుడి మృతిపై హెచ్ ఆర్ సీ సీరియస్ జీహెచ్ ఎంసీ కమిషనర్ కు నోటీస్

ముద్ర, హైదరాబాద్ :
హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడలోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ర్యాంప్, కంపాక్టర్ యంత్రంలో పడి పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆదివారం ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ చైర్మన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించారు. కార్మికుడి మృతికి సరైన భద్రతా చర్యలు లేకపోవడం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని కమిషన్ ప్రాథమికంగా అభిప్రాయపడింది. పని ప్రదేశంలో కనీస రక్షణ కల్పించకపోవడం అనేది కార్మికుల జీవించే హక్కు, మానవ గౌరవం, సురక్షిత పని పరిస్థితుల ఉల్లంఘన కిందకు వస్తుందని కమిషన్ పేర్కొంది. ఈ అంశాన్ని విచారణకు స్వీకరించిన కమిషన్.. దీనిపై తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి వచ్చే నెల 23లోపు వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ కర్ణణ్ ను ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.