అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్
ముద్ర మొయినాబాద్ మార్చ్ 27: మొయినాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికమైన మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజిత్ నగర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ హాజరై మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం 2007 సంవత్సరంలో ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 189, 203 లలో 577 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు అట్టి భూమిని రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమించింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేకసార్లు కలెక్టర్, ఆర్డిఓ, ఎమ్మార్వో స్థాయిలో రామోజీ యాజమాన్యంతో చర్చలు జరిపి భూములకు సంబంధించి రామోజీ యాజమాన్యం ఈ భూములు పేదలకు చెందినయని రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులను భూమి దగ్గరికి రానీయకుండా ప్రహరీ గోడ ఏర్పాటు చేసి భయభ్రాంతులకు గురి చేశారు పేదలకు ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారిని, సిపిఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య గారిని మరియు జిల్లా ముఖ్య ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని సిపిఎం చేవెళ్ల డివిజన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వెంటనే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఇళ్ల పట్టాలు పొందిన పేదలందరికీ ఇళ్ల జాగాలు చూపియాలని ప్రభుత్వ భూమి కబ్జా చేసిన రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై అసైన్మెంట్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మొయినాబాద్ మండల కన్వీనర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్, ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షులు డప్పు మహేందర్, రాజేందర్,రవి,సాయి, వెంకటేష్,కృష్ణ,శ్రీను, యాదగిరి, ఇస్మాయిల్, బాలు,డాన్ తదితరులు పాల్గొన్నారు,