Take a fresh look at your lifestyle.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం… సిట్ దర్యాప్తుతో కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణిచివేస్తాం దాని వెనక ఎవరున్నా ఉపేక్షించం
మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ పార్టీ ఘటనను సీరియస్ గా తీసుకున్నాం
అందుకే 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశాం
2029లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి
జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజనతో ఆలస్యం
ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్

న్యూఢిల్లీ :

తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణిచివేస్తామని స్పష్టం చేశారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారి ప్రమేయం ఉన్నా సరే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సరిదిద్దుతూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం కీలక అంశాలపై మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పటికే తొమ్మిది మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నిఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేసులో ఏలూరు ఎంపీ (పుట్టా మహేష్ కుమార్) పట్టుబడ్డారన్నారు. ప్రస్తుతం ఆయన స్టేషన్ బెయిల్ మీద బయట తిరుగుతున్నారని చెప్పారను. అయితే ఇందులో తమ ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదున్నారు.చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలకు సీఎం చెక్ పెట్టారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో 2029లోనే ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అందరూ ఊహిస్తున్నట్లు 2028లో ఎన్నికలు రావని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు. అంతకుముందు పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలను రేవంత్‌రెడ్డి కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని రాహుల్‌, ప్రియాంకలకు రేవంత్‌ పరిచయం చేశారు.

Leave A Reply

Your email address will not be published.