Take a fresh look at your lifestyle.

రోబోటిక్ మోకాలి శస్త్రచికిత్సతో 100% ఫలితాలు

 

మోకాలి రీప్లేస్మెంట్‌లో కొత్త దశ

రోబోటిక్ టెక్నాలజీతో త్వరితగతి కోలుకోలు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

రోబోటిక్ మోకాలి రీప్లేస్మెంట్ సిస్టం మంచి ఫలితాలు ఇస్తుందని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ విక్రమ్, యశోద ఆసుపత్రి ప్రతినిధి రాజిరెడ్డిలు తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మోకాలి రీప్లేస్మెంట్ చేసుకున్న పేషంట్లతో కలిసి యశోద ఆసుపత్రి వైద్యులు మాట్లాడారు. సిద్దిపేట పట్టణానికి చెందిన డాక్టర్ కుమార్, శకుంతల అనే పేషెంట్లకు 45 రోజుల క్రితం మోకాలి రీప్లేస్మెంట్ ఆపరేషన్ రోబోటిక్ ద్వారా నిర్వహించామని, 100% రీప్లేస్మెంట్ రిజల్ట్ సాధించామని తెలిపారు. రోబోటిక్ సిస్టం ద్వారా ఆపరేషన్ చేస్తే త్వరగా రికవరీ అవుతారని, అలాగే నీ రీప్లేస్మెంట్లో కచ్చితత్వం ఉంటుందని పేర్కొన్నారు. రోబోటిక్ సిస్టం ద్వారా ఆపరేషన్ చేస్తే నొప్పి చాలా తక్కువ ఉంటుందని మొదటి రోజే నడవ గలుగుతారని అన్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో మోకాలి రిప్లేస్మెంట్ నిర్వహిస్తున్నామన్నారు. సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.