Take a fresh look at your lifestyle.

భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరాలి : మంత్రి సీతక్క

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం..

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, భువనగిరి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం
భువనగిరి ఎమ్మెల్యే కుంభo అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక హైదరాబాద్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. భువనగిరి ఎంపీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ సీటు కావడంతో భువనగిరి మున్సిపల్ చైర్మన్ సీటు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి అన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి లోని 35 వార్డులకు 30 వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించు కోవాలన్నారు.
ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీతక్క
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఆయనకు మంత్రి సీతక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.