ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరవేయడం మండల సభల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.

గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు.
గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసాచారి, ప్రత్యేక అధికారి జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, ఎంపీడీవో రఫీక్ ఉన్నిసా బేగం, సర్పంచ్ శేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘించొద్దు
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలో అరైవ్ -అలైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘించొద్దని సూచించారు. సురక్షితంగా గమ్యాన్ని చేరాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్య అధికారి శ్రీరామ్, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి వెంకట స్వామి, డిఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.