ముద్ర: తాండూర్. వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురేష్ నాయక్ కు మద్దతుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ తనకున్న సంస్థలలో వార్డు ప్రజల కోసం 50 శాతం రాయితీ కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 13 వార్డ్ ప్రజలు పెళ్లిళ్లకోసం వినాయక కన్వెన్షన్ హాల్లో, వినాయక హాస్పిటల్ లో, వినాయక నర్సింగ్ కళాశాలలో, వినాయక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో పై నాలుగు సంస్థలలో 13వ వార్డు ప్రజలకు 50 శాతం రాయితీ కల్పిస్తానని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కారు గుర్తుకు ఓటు వేసి సురేష్ నాయక్ ను గెలిపించాలని ఆయన కోరారు.ఈ యొక్క వార్డులో ఇద్దరూ హేమా హేమీల మధ్య జరుగుతున్న పోటీలో 13వ వార్డు మున్సిపల్ పరిధిలోనే అదృష్టవంతమైన వార్డ్ గా ప్రజలు పేర్కొంటున్నారు.