Take a fresh look at your lifestyle.

సింగరేణి ప్రాజెక్టులో మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ సందర్శన.

యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: సింగరేణి రామగుండం మూడవ డివిజన్ ఓసిపి.1 లో బుధవారం డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డి‌ఎం‌ఎస్) మెకానికల్ సుధీర్ జీ బైసరే సందర్శించారు.ఉదయం ప్రాజెక్టుకు వచ్చిన డైరెక్టర్ ను,ప్రాజెక్టు అధికారి జె. రాజశేఖర్ సాదరంగా ఆహ్వానించి మొక్కను బహుకరించి శాలువతో సత్కరించారు.ముందుగా ఆయన ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించారు.అనంతరం ఆఫ్ లోడింగ్ పనిస్ధలాలలోని యంత్రాలను సందర్శించి,వాటి పని తీరును పరిశీలించారు.అలాగే ప్రాజెక్టు ఎక్స్ ప్యాన్షేన్ కొరకు ప్రతిపాదనలు, సర్వే చేసిన ఏరియాని మ్యాప్ ద్వారా పరిశీలించారు.తదనంతరం ప్రాజెక్టులోని ఉత్పత్తి ఉత్పాదకత స్థితి గతులను, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో తీసుకోవలసిన రక్షణ చర్యలు, యంత్రాల వినియోగం,వాటి పని తీరు మొదలగు అంశాలపై చర్చించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. గనికి నిర్దేశించిన ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించడానికి తగిన భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.ఇక డిఎంఎస్ వెంట ఏరియా ఇంజనీర్ వై‌వి. శేఖర బాబు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రామ్ మోహన్, మేనేజర్ ఉదయ్ హరిజన్, ప్రాజెక్టు ఇంజనీర్ ఉదయ్ భాస్కర్, సేఫ్టీ ఆఫీసర్ పి. శ్రీనివాస రావు, కాలరి మేనేజర్ నజీర్ అహ్మెద్, సర్వే ఆఫీసర్ నబీ, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.