Take a fresh look at your lifestyle.

రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి-తల్లుల కమిటీ జిల్లా అధ్యక్షులు బిస్మిల్లా బేగం

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 20% కేటాయించాలని మదర్స్ కమిటి, బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యాలయం వికారాబాద్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ మార్చిలో ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 20% కేటాయించాలని మదర్స్ కమిటి, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు మాట్లాడుతూ విద్యకు బడ్జెట్ కేటాయించడంలో గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా కేటాయింపులను పరిశీలిస్తే పేద విద్యార్థులకు విద్య నందించడంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందో అర్థ మవుతుందని చెప్పారు. ఇప్పుడు కేటాయించిన 7.3% నిధులు కేవలం జీతాలకే సరిపోతుందని అందువల్ల కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టో లో చెప్పినవిధంగా నిధులు కేటాయించాలని తల్లుల సంఘం వికారాబాద్ జిల్లా డిమాండ్ చేస్తుందని చెప్పారు. మదర్స్ కమిటి జిల్లా అధ్యక్షులు బిస్మిల్లా బేగం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం విద్యకు 20% కేటాయించాలని లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా మదర్స్ కమిటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ శివరాజ్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా విద్యకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న ఏమాత్రం స్పందన లేదని వచ్చే బడ్జెట్ లో కనీసం 20% కేటాయించ కుంటే తల్లిదండ్రులతో కలిసి ప్రత్యక్ష ఉద్యమం చెపడతామని హెచ్చరించారు. అనంతరం వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, అంజమ్మ, పోచమ్మ,ప్రసన్న రాణి, సునీత, ఎంవి పౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, ఆశలత, దేవకుమారి, ఉమాదేవి, శ్రీలత, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.