Take a fresh look at your lifestyle.

విత్తన బంతులు తయారు చేసిన విద్యార్థులు

 

​మహదేవ్‌పూర్, ముద్ర:

పర్యావరణ సమతుల్యతను కాపాడటం మరియు అడవుల పెంపకమే లక్ష్యంగా మండలంలోని సురారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు విత్తన బంతులను తయారు చేశారు. నేషనల్ గ్రీన్ కోర్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థులలో పర్యావరణ స్పృహను పెంపొందించింది. పాఠశాల ఎకో-క్లబ్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మట్టి, ఎరువు మరియు దేశవాళీ విత్తనాలతో వేప, నేరేడు, చింత మొదలైన వందలాది విత్తన బంతులను సిద్ధం చేశారు. మండల విద్యాధికారి విద్యార్థుల పనితీరును అభినందించారు. ఈ విత్తన బంతులను రాబోయే వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాలలో మరియు అటవీ ప్రాంతాలలో వెదజల్లడం జరుగుతుందని తెలిపారు.
​ప్రధానోపాధ్యాయులు మెతుకు పురుషోత్తం రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.