మహాదేవపూర్, ముద్ర:
కూరగాయల సాగులో ముందున్న జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో రైతు ఐలక్క సాగు చేస్తున్న మునగ తోటను డివిజన్ ఉద్యాన శాఖ అధికారి వై.మణి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సరితతో కలిసి తోటను సందర్శించి, పంట సాగు విధానాలు, దిగుబడులపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మునగ చెట్ల పెంపకం, సంరక్షణపై అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ హెచ్‌ఈఓ రాందాస్ పాల్గొన్నారు.