గిరిజన సహకార సంస్థలో చిరుద్యోగిదే హల్చల్కంప్యూటర్ ఆపరేటరే మేనేజర్ గా వ్యవహారం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ
మహాదేవపూర్, ముద్ర:
మండల కేంద్రంలో ఉన్న గిరిజన సహకార సంస్థలో పనిచేస్తున్న ఓ థర్డ్ పార్టీ ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నతను షాడో మేనేజర్ గా వ్యవహరిస్తూ హల్చల్ చేస్తున్నాడని మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ ఆరోపించారు. ఇతని అక్రమాలు అవినీతిపై తక్షణం విచారణ జరిపి ఇతర నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన సహకార సంస్థకు మేనేజను నియమించకపోవడంతో ఎటునాగారంలోని డిఎం ఇన్చార్జిగా వ్యవహరిస్తుండగానే ఇందుకు కారణం. బియ్యం పూర్తిగా ఇతనిపై ఆధారపడడంతో అవినీతి అక్రమాలకు హద్దు లేకుండా పోయింది. మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థలో డిఆర్సి పాయింట్, ఏం ఎల్ ఎస్ పాయింట్, గ్యాస్ పంపిణీ గోదాం నిర్వహణ ఇతడు చెప్పినట్లే జరగాలి. వీటి నిర్వహణలో ఈ కాంట్రాక్టు ఉద్యోగి దూరుతూ అక్రమాలు చేస్తున్నట్టుగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆరోపించారు.ఈ కంప్యూటర్ ఆపరేటర్ అన్ని అక్రమాలకు కేరాఫ్ మారి ప్రతి దాంట్లో కమిషన్ డిమాండ్ చేస్తూ దందా నడిపిస్తున్నాడు. ఆ ఉద్యోగి కి నచ్చకుంటే ప్రభుత్వ ఉద్యోగులైన వారిని సైతం బ్లాక్ మెయిల్ చేసి అయిన దారిలోకి తెచ్చుకుంటాడని ఇతనిపై ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు లేని అధికారం ఈ థర్డ్ పార్టీ ఉద్యోగికి ఎవరు అధికారం ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా తిష్ట వేసి పాతుకుపోయిన ఈ బాగోతం బయటికి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు డిమాండ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ చాలామందిని మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా తాను చెప్పింది వేదం అన్న విధంగా వ్యవహరించడం పై కూడా విచారణ చేపట్టి తక్షణమే విధుల నుండి తొలగించాలని, పిఓ విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు డిమాండ్ చేశారు.