మహాదేవపూర్, ముద్ర:
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని, ఆసరా పెన్షన్ల పెంపు, రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ, రైతుభరోసా, మహిళలకు 2500 మహాలక్ష్మి పథకం,జాబ్ క్యాలెండర్, నిరుద్యోగభృతి, విద్యార్థులకు స్కూటీ, వంటగ్యాస్ సబ్సిడీ, వంటి పలు పథకాలను అమలు చేయాలని బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రామిశెట్టి మనోజ్ ఒక ప్రకటనలో కోరారు. ఈ మేరకు తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. గద్దె నెక్కిఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాయ మాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య, దడిగెల వెంకటేష్, కొక్కు రాకేష్, బల్ల సంపత్, హరీష్ చంటి, రాకేష్ లు పాల్గొన్నారు.