Take a fresh look at your lifestyle.

బీజేపీ విజయం కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలి

కోరుట్ల, ముద్ర విలేకరి: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన సమరానికి సిద్ధంగా ఉండాలని బీజేపీ కథలాపూర్ మండల శాఖ అధ్యక్షుడు మల్యాల మారుతి అన్నారు. బుధవారం రోజు కథలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ 19 గ్రామాల్లో జూనియర్, సీనియర్ భేదం లేకుండా బూత్ స్థాయి నుండి ప్రతి కార్యకర్త బీజేపీ విజయం కోసం తీవ్రంగా శ్రమించాలని కోరారు. గ్రామాల్లోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాలకు కేంద్రప్రభుత్వం అందజేస్తున్న నిధులను, అభివృద్ధి కార్యక్రమాల గూర్చి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వివరించాలన్నారు. గత 11 సంవత్సరాల్లో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు మోడీ కానుకగా అందజేయబడుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, గోపాల్ రెడ్డి, వినోద్ రెడ్డి, సత్యనారాయణరెడ్డి, అంజయ్య, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సత్యం, ప్రతాప్, అంజయ్య, మహేష్, సునీల్, జలందర్, అశోక్,ప్రశాంత్, శివ, కమలాకర్, శ్రీకర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.