Take a fresh look at your lifestyle.

స్వర్ణగిరి క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు…

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు బుధవారం మూడవ రోజు వైభవంగా జరిగాయి. ఉదయం శ్రీ వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యార్చనలు పూర్తి చేశారు.
శ్రీ పెరుంబుదూర్‌కు చెందిన శ్రీ శ్రీ శ్రీ ఎంబార్ రామానుజ జీయర్ స్వామి వారు విచ్చేసి భక్తులకు తమ మంగళాశాసనాలు అందజేశారు. సాయంత్రం పల్లకి సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
సాయంత్రం కల్పవృక్ష వాహనసేవ మహా వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామివారు కల్పవృక్ష వాహనంపై విరాజిల్లుతూ భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు.

Leave A Reply

Your email address will not be published.