Take a fresh look at your lifestyle.

రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు

ముద్ర ప్రతినిధి, మెదక్:
రెండు సంవత్సరాలపాటు మెదక్ కలెక్టర్ గా పనిచేసి బదిలీపై సహకార శాఖ ప్రత్యేక కమిషనర్ గా హైదరాబాద్ వెళ్లిన రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. మెదక్ కలెక్టరేట్ లో  రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు ఏర్పాటు చేశారు.

అదనపు కలెక్టర్ మెంచు నగేష్ మాట్లాడుతూ..
వినూత్నం.. విప్లవాత్మకంగా
మెదక్ జిల్లాను రోల్ మోడల్ గా నిలిపారని కొనియాడారు. రికార్డు సొంతం చేసుకునేలా పాలనపై రాహుల్ రాజ్
తనదైన ముద్ర వేశారన్నారు. బృహత్తర కార్యక్రమాలతో అద్భుత ఫలితాలు.. సాధించడం,
ఉద్యోగులు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
ఎస్పీ డి.వి శ్రీనివాసరావు మాట్లాడుతూ...

పోలీస్, రెవిన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ
ప్రతి అంశంలో సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. జిల్లాలో శాంతి భద్రతకు తన వంతు కృషిగా చేశారని తెలిపారు.
సహకారం వరువలేనిది బదిలీపై వెళ్తున్న రాహుల్ రాజ్ మాట్లాడుతూ…

మెదక్ జిల్లాలో పనిచేసిన కాలంలో జిల్లా అధికారులు సమన్వయం మరువలేనిదని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేసేందుకు విశేష కృషి చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అనంతరం జిల్లా అధికారులు, సిబ్బంది పూల బొకేలు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, అదనపు ఎస్పీ మహేందర్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవోలు రమాదేవి, జై చంద్ర రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు దొంతి నరేందర్, జనరల్ సెక్రెటరీ రాజ్ కుమార్, రెవిన్యూ అసోసియేషన్ అధ్యక్షులు
మహేందర్ గౌడ్ , జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఇతర జిల్లా అధికారులు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.