ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు.
శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని రాష్ట్ర డి ఐ జి మహేష్ భగవత్ లతో కలిసి హైదరాబాద్ నుండి మున్సిపల్ ఎన్నికల పై ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జనరల్ అబ్జర్వర్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మాట్లాడుతూ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆమె వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు పలు సూచనలను చేశారు.
డి ఐ జి మహేష్ భగవత్ మాట్లాడుతూ ఎన్నికల సందర్బంగా అక్రమ మద్యం, డబ్బు,ప్రలోబాలకు గురి చేసే సామాగ్రిని ఎప్పటికప్పుడు ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు నిరంతరం నిఘా ఉంచాలని, అలాగే అంతరరాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామని, రౌడీ షీట్ నమోదైన వారిపై పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ షాడో టీమ్ నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, ఎన్నికల పరిశీలకులు గౌతమి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ హనుమంత రావు మాట్లడుతూ జిల్లాలో, ఆరు మున్సిపాలిటీలలో 104 వార్డులకు 212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని వివరించారు.
జిల్లా ఎస్పి అక్షాంశు యాదవ్ మాట్లాడుతూ జిల్లా లో సమస్యత్మాకంగా గుర్తించిన ప్రాంతాలలో పటిష్టమైన బందోబస్త్ మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని,ఎక్కడా సమస్యలు తలేత్తకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణం లో నిర్వహిస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.