Take a fresh look at your lifestyle.

గ్యాస్ ధర పెంచి ప్రజలపై భారం మోపుతున్న కేంద్రం….. సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు

 

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి:

అంబానీ ఆదాని కార్పొరేట్ ఆస్తులను కాపాడటమే నరేంద్ర మోడీ కర్తవ్యం అని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు విమర్శించారు పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలని పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం డిమార్ట్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నిత్యవసర వస్తువుల పైన పెట్రోల్, డీజిల్ పైన గ్యాస్ పైన ధరలు పెంచి సామాన్యుల పై అధిక భారం వేసారని అన్నారు.19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కసారిగా 993 రూపాయలు పెంచడం అత్యంత దుర్మార్గం అన్నారు. దీనితో హోటలు టిఫిన్ సెంటర్లో చిన్న వ్యాపారపై పెనుబారం పడుతుందని దాని ద్వారా నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశానికి అంటుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో గత కొన్ని మాసాలుగా గ్యాస్ వినియోగదారులు సకాలంలో గ్యాస్ సిలిండర్ సరఫరా కాకపోవడం వల్ల వినియోగదారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అలాగే పెట్రోల్, డీజిల్ , గ్యాస్ యజమానులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ తరలించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కావున అధికారులు తగిన చర్యలు చేపట్టాలని తనిఖీలు నిర్వహించాలని ప్రజలు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యవర్గ సభ్యులు మాజీ కౌన్సిలర్ అనంతుల మల్లేశ్వరి, మైనార్టీ జిల్లా నాయకులు ఎండి పాషా, ఏఐవైఎఫ్ గౌరవ అధ్యక్షులు కుక్కడప్పు శౌరి, అధ్యక్షులు బూర సైదులు, కార్యదర్శి ఎడెల్లి శ్రీకాంత్, ఎస్.కె మదర్ తదితరులు పాల్గొన్నారు*.

Leave A Reply

Your email address will not be published.