ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో గల శ్రీ అలెర్మెల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) జీ.వి.శ్యాంప్రసాద్ లాల్ పూజలు నిర్వహించడం జెరిగింది.

శ్రీ వెంకటేశ్వరస్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయ బ్రాహ్మణులచే శాలువాతో ఘనంగా సన్మానించి వేద ఆశీర్వచనం చేశారు.
అలాగే గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శి, బాలస్వామి శాలువాలతో సత్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా, ప్రశాంతత ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజాచార్యులు, వేద బ్రాహ్మణులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.