Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీని బూతు స్థాయి నుంచి బలోపేతం చేయాలి -జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే ప్రశాంత్ కుమార్ రెడ్డి

 

ముద్ర, నారాయణపేట:

నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బూతు స్థాయి నుంచి బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక డిసిసి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలు తీరు ఎలా ఉందో మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. నాయకులు కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. పేట మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివ రెడ్డి, జిల్లా ఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రసన్నా రెడ్డి, నరేందర్, హనుమంతు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.