Take a fresh look at your lifestyle.

అకాల వర్ష బాధితులను ఆదుకోండి -బి ఎస్ పి జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులు భారీగా నష్టపోయారని, వారికి ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బిఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ సోమవారం కురిసిన వర్షాలు, బలమైన గాలుల కారణంగా జిల్లాలో వివిధ రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, ముదోల్ నియోజక వర్గాల్లో మామిడి, నువ్వు, పసుపు, మొక్కజొన్న, వరి తదితర పంటలు నేలకొరిగి రైతులు నష్టపోయారన్నారు. ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులతో పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరా కు రూ.60 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.