ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల నియోజకవర్గంలో అభివ్రుద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. జగిత్యాల నియోజకవర్గంలో అనేక వంతెనలు చెడిపోయాయని, అదేవిధంగా రామాజీపేట, రాయికల్, పెంబట్ల బ్రిడ్జ్ ల పని పూర్తి అయినా గాని వాటి అప్రోచ్ రోడ్డు పూర్తి కాలేదని, పలు చోట్ల రోడ్లు రెన్యూవల్ చేయాల్సిన అవసరం ఉందనీ, నూతన రోడ్లు కూడా మంజూరు ఇప్పించాలని మంత్రి కి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. సారంగాపూర్-పోతారం, జగిత్యాల-అంతర్గం నూతన రోడ్లు కావాలని, నూతనంగా కొన్ని బ్రిడ్జ్‌లు గోవిందపల్లి బ్రిడ్జ్, నర్సింగ పూర్ బ్రిడ్జ్, పెరకపల్లి బ్రిడ్జ్, లో లెవెల్ బ్రిడ్జి లు రాయికల్, సారంగాపూర్ మండలంలో బ్రిడ్జిలు ఉన్నాయని, కొత్త వాటికి టెండర్ పిలవాల్సిందిగా మంత్రికి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ కు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.