Take a fresh look at your lifestyle.

వరంగల్ భిఆర్ఎస్ సభ విజయవంతంతో ఖంగుతిన్న కాంగ్రెస్

  • ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ నాయకుల పైసా వసూల్ షురూ తాటికొండ సీతయ్య.
  • మాజీ ఎంపీపీ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు.

తుంగతుర్తి, ముద్ర: వరంగల్ జరిగిన బి ఆర్ ఎస్ సభను చూసిన కాంగ్రెస్ నాయకులు కంగుతిని కలవర పడుతున్నారని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు.తుంగతుర్తి పార్టీ కార్యాలయం లో మాట్లాడాతు ప్రభంజనం లా వరంగల్ సభకు వెల్లువె త్తిన జనాన్ని చూసి ప్రభుత్వ పెద్దలు ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని, బి ఆర్ ఎస్ పదేండ్ల పాలనలో వచ్చిన వ్యతిరేకత కన్నా 16నెలల కాంగ్రెస్ పాలన మీద వచ్చిన వ్యతిరేకతే ఎక్కువని ప్రజలు రుజువు చేశారని అన్నారు.భవిష్యత్ కాలం బిఆర్ఎస్ దే అన్నారు.అవినీతి గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పైసా వసూలు మొదలు పెట్టిన మీరు అవినీతి గురించి మాట్లాడితే గురవింద గింజ సామెత లాగ నె ఉంటదని అన్నారు. సభలో కెసిఆర్ చేసిన ప్రసంగం ప్రజలను చైతన్య పరిచేలా సాగింది అని అన్నారు.ముఖ్య మంత్రి గా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కెసిఆర్ ఏలాలి అనే అభిప్రాయం ప్రతి ఒక్కరి లో కనిపించిందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ దివాలా కోరు విధానాలతో పాలన తో కాంగ్రెస్ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిందనే భావం ప్రజలందరి లోను కనిపించిందని అన్నారు.రానున్న 3 సంవత్సరాల కాలమంత బిఆర్ఎస్ శ్రేణులు ప్రజా పోరాటాలు నిర్వహిస్తాయని అన్నారు.ఈ సమావేశం లో జిల్లా నాయకులు గుండాగానీ రాములుగౌడ్. గునిగంటి సతీష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.