ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఓ. పి రిజిస్టర్ ను పరిశీలించి గత నెలలో ఈ ఆసుపత్రి లో ఎన్ని సాధారణ ప్రసావాలు జరిగాయని తెలుసుకున్నారు. కలెక్టర్ ఆసుపత్రి లోని వార్డులను తిరుగుతూ, పేషెంట్ల వద్ద కు వెళ్లి వారి ఆరోగ్యం పరిస్థితు లను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమం వైద్యులు సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని, విద్యార్థులకు బోధించేందుకు ఎంతమంది టీచర్లు ఉన్నారని అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన మరియు రుచికరమైన ఆహారం అందించాలని, ఎప్పటికప్పుడు తాజాగా ఉన్న కూరగాయలు మాత్రమే వంటకు ఉపయోగించాలన్నారు.
10వ తరగతి పరీక్ష వ్రాసే విద్యార్థులకు కలెక్టర్ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.