ముద్ర, గద్వాల:
ఓ వైపు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. మరోవైపు జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధ్వానంగా తయారైంది. పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప చేసిందేమీలేదు. పేరుకు మాత్రం స్వచ్చా గద్వాల్ గా చెబుతున్నా నిర్వహణలో మాత్రం శూన్యం చూపిస్తున్నారు గద్వాల మున్సిపాలిటి అధికారులు.
గద్వాల మున్సిపాలిటి పరిధిలో పలు వార్డులలో ఎక్కడపడితే అక్కడ చెత్త, చెదారం దర్శనమిస్తున్నాయి. ప్రజలలో అవగాహన కొరవడంతోపాటు అధికారుల నిర్లక్ష్యంతో రోడ్ల పైన చెత్త దర్శనమిస్తున్నది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి దుమారంతో చెత్తాచెదారం రోడ్లపైకి వచ్చి చేరుతున్నడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పారేసిన చెత్తతో దుర్గంధం వెదజల్లుతుండటంతో ముక్కు మూసుకొని వెళ్లవలసిన పరిస్థితి నెలకొంటుందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు సరైన రీతిలో పర్యవేక్షణ లేకపోవడంతో పాటు ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని విమర్శలున్నాయి.
పొటొలు
01:జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు పేరుకపోయిన చెత్త
02: ఆరో వార్డులో దాణా ఫ్యాక్టరీవద్ద పేరుకపోయిన చెత్త చెదారం.