*సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
———————————–
సుల్తానాబాద్, మార్చి- 05:
———————————
ఆసుపత్రిలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సుల్తానాబాద్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు
జిల్లా కలెక్టర్ కోకెయ శ్రీహర్ష ఆసుపత్రి ఓపి సేవలను పరిశీలించి డెంటల్ ఓపి కు వస్తున్న కేసులు , అందిస్తున్న చికిత్స గురించి వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్ హెల్త్ చెక్ అప్ షెడ్యూల్ ప్రకారం జరిగేలా చూడాలని, అవసరమైన వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
రోగులతో ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రి కి వచ్చిన పేషంట్ లతో మాట్లాడారు.ఎన్.సి.డి విభాగం పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో మందుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి ఆర్.ఎం.ఓ, సిబ్బంది, పాల్గొన్నారు.