Take a fresh look at your lifestyle.

ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కరరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను స్థానిన సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు పరిశీలించారు.
శనివారం భువనగిరి పట్టణంలోని గంజ్ హై స్కూల్‌, భువనగిరి లోని ప్రభుత్వ బాలుర పాఠశాల , భువనగిరి లోని విజ్ఞాన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షకు విద్యార్థులు ఎంతమంది హాజరయ్యారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భయాందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, భద్రతా చర్యలు , మెడికల్ సిబ్బంది ,తదితర అంశాలను పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి పరీక్ష పూర్తయిన వెంటనే జవాబుకు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో పరీక్షా కేంద్రాల సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.