Take a fresh look at your lifestyle.

వేతనం తక్కువ.. పని భారం ఎక్కువ

  • 18 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకుంటలే.
  • సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగుల ఆవేదన.

జయశంకర్ భూపాలపల్లి : జూన్ నెలలో విద్య వేవస్థ ప్రారంభం కానున్న నేపథ్యంలో సమగ్ర ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తక్కువ వేతనం తో కుటుంబ బారాన్ని మోయలేకపోతున్నామని ప్రభుత్వాలు మారుతున్నా సమగ్ర ఉద్యోగుల బతుకులు మారడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జరగబోయే కాబినెట్ సమావేశం లో సమగ్ర ఉద్యోగుల పై చర్చ జరపాలని తమకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు. జూన్ 02 తేదీ వరకు తీపి కబురు చెప్పాలని కోరుతున్నారు.రాష్ట్రంలోని విద్యారంగ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తూ పిల్లలకు విద్యను బోధిస్తున్న సమగ్రశిక్ష అభియాన్‌ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట్టి ఏడాది గడుస్తున్న ఇప్పటి వరకు ప్రభుత్వలు పట్టించుకోవడం లేదు.2008లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో సమగ్రశిక్ష అభియాన్‌ అమల్లోకి వచ్చింది. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో ఈ ప్రాజెక్టు ఏర్పడింది. దీనిలోని ఉద్యోగులు దాదాపు 15 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. చాలీ చాలని వేతనాలతో, అధిక పనిభారంతో సతమతమవుతున్నామని, తమను క్రమబద్ధీకరించాలని నాలుగేళ్లుగా పోరాటాలు చేస్తున్నా తమను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పద్దెనిమిదిళ్లుగా పనిచేస్తున్న వీరికి గతంలో వివిధ సందర్భాల్లో సీఎం, విద్యాశాఖ మంత్రి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలుకు నోచుకోకపోవడంతో వారు గత ఏడాది గా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం నిమ్మకు నిరీత్తినట్టు వేవహరిస్తోంది.

  • వేతనం తక్కువ.. పని భారం ఎక్కువ.

జిల్లాస్థాయిలో డీఈవోలు, సిస్టమ్‌ అనలిస్టులు, ఏపీవోలు, టెక్నికల్‌ పర్సన్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డీఎల్‌ఎంట్రీ అటెండర్లు, రీసోర్స్‌ పర్సన్లుగా, భవిత కేంద్రాలతో పాటు మండల రీసోర్స్‌ పర్సన్‌లు, కేజీబీవీల్లో, స్కూళ్లలో వివిధ హోదాల్లో వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో సీఆర్సీ తమ పరిధిలోని పాఠశాలలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ డీఈవో, ఎంఈవోల మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తున్నారు. బోధనేతర బిల్లులు, మధ్యాహ్న భోజన బిల్లులు తయారు చేయడం, డీఈవో కార్యాలయం నుంచి అడిగిన ప్రతి సమాచారాన్ని సేకరించి పంపించడం, పాఠశాలల్లో ఉపాధ్యాయులు రాని సమయంలో విధులు నిర్వర్తించడం వంటివి చేస్తున్నారు. ఇంత చేస్తున్న వారికి మాత్రం చాలీచాలని వేతనాలు అందుతున్నాయి. నెలకు రూ.8,500 నుంచి రూ. 32 వేల వరకు ఉన్నాయి. రూ.19,500 వేతనం అందుకుంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం కోసం యేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు . ఇప్పటికే గత ఏడాది జిల్లాస్థాయిలో 15 రోజులపాటు కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టారు.

  • సమగ్ర ఉద్యోగుల డిమాండ్లు.

‘సమగ్ర శిక్షణ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలి. అప్పటి వరకు కనీస వేతన పే స్కేల్‌ అమలు చేయాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులివ్వాలి. విద్యాశాఖ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి ఉద్యోగికీ జీవిత బీమా రూ.10లక్షలు, ఆరోగ్య బీమా రూ. 5లక్షలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 73 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తూ మరణించినా వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని జిల్లా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం నడుస్తున్న కేబినెట్ సమావేశం లో తమ న్యాయమైన డిమాండ్స్ పై చర్చ నిర్వహించాలని కోరుటన్నారు.

Leave A Reply

Your email address will not be published.