- మాజీ మంత్రి సబితారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మంచిరెడ్డి.
- రైతులతో కలిసి కలెక్టర్ కు బీఆర్ఎస్ నేతల వినతి.
ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: ఫార్మాసిటీ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఫార్మాసిటీ రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల అంగీకారం లేకుండా టీజీఐఐసీ పేరిట ఆన్‌లైన్‌లో నమోదైన భూమిని వెంటనే తిరిగి రైతుల పేరిట మార్చి, రైతు భరోసా తదితర పథకాలు వర్తింపజేయాలని అన్నారు. భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, న్యాయమైన పరిహారం చెల్లించాలని చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించిన తరువాతనే పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహా రెడ్డి, నాయకులు రమేశ్ గౌడ్, పాశ్చ భాష, రామిడి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ ప్రభాకర్, గంగాపురం లక్ష్మీనర్సింహా రెడ్డి, రాజునాయక్, గోవర్ధన్ నాయక్, శేఖర్ గుప్తా, గుర్రం సాయికిరణ్ రెడ్డి, పరికిషన్ రెడ్డి, మెరుగు రమేష్, కందుకూరి సాయి, శ్రీధర్ రెడ్డి, హబీబుద్దీన్, రైతులు ఉన్నారు.
