Take a fresh look at your lifestyle.

కాలనీ సమస్యలు తెలుసుకుంటున్న చైర్మెన్ ,వైస్ చైర్మెన్ ….

 మోత్కూరు ముద్ర న్యూస్:

మోత్కూర్ మున్సిపల్ పరిధిలో పాత బస్టాండ్, శ్రీకాంత్ చారి చౌరస్తా (చెరువు కట్ట) కొత్త బస్టాండ్ ప్రాంతాలలో మార్నింగ్ వాకింగ్ లో భాగంగా బుధవారం ఉదయం మున్సిపల్ చైర్మెన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య వైస్ చైర్మెన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, మున్సిపల్ కమీషనర్ సిబ్బందితో కలిసి మురికి కాల్వలు సిబ్బంది పని తీరును పరిశీలించారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది, కమీషనర్ లతో మాట్లాడుతూ రోడ్లపై చెత్త చెదారం, లేకుండా చేయాలని, పట్టణంలో అన్ని వీధులలో చెత్త వాహనాలను పంపించి తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి రాష్ట్రంలో ఉత్తమ స్వచ్ఛ మోత్కూరుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు బయ్యని రాజు, సోమలింగం శేఖరాచారి , మున్సిపల్ సిబ్బంది నరసింహ చారి, జంగనాగరాజు , బుర్ర రాము తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.