బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 5% శాతం నిధులు కేటాయించాలి..
ఎన్ పి ఆర్ డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా :
జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సురుపంగ ప్రకాష్, వనం ఉపేందర్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
వికలాంగుల పెన్షన్ 6 వేలకు పెంచి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 5% శాతం నిధులు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సురుపంగ ప్రకాష్, వనం ఉపేందర్ లు డిమాండ్ చేశారు. బుధవారం
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వికలాంగుల పెన్షన్ 6000 ఇస్తామని రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు పెన్షన్ గురించి ఆలోచన చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వికలాంగుల పరిరక్షణ చట్టం 2016 అమలు చేసి వికలాంగులకు సంక్షేమ పథకాలలో రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాలన్నారు. గ్రామీణ ఉపాధి పథకాన్ని యధావిధిగా ఉంచాలని విబి జి రామ్ జీ స్కీమును రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికలాంగులకు అందిస్తున్న సహాయ పరికరాల యందు నోటరీ అబ్డేవిట్ రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, ఉపాధ్యక్షులు శ్యాంసుందర్, జిల్లా నాయకులు కీసర వెంకటరెడ్డి, గొడుగు దాసు, నాగు, నరసింహ, పున్న శ్రీధర్, శివగల రాములు, ఏషాల గోపి, పర్వతం సాలమ్మ, గర్దాసు సత్తయ్య, యాట చందు, హరిబాబు, మంచాల జనార్ధన్ పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.