Take a fresh look at your lifestyle.

కార్మిక హక్కుల కోసం సంఘటితంగా పోరాడుదాం

హనుమకొండ ,ముద్ర ప్రతినిధి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తూ, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు మైదం పాణి, పి.డి.ఎస్.యు.రాష్ట్ర ఉపాధ్యక్షులుబి. నరసింహారావు, టి.యు.సి.ఐ. జిల్లా నాయకులు ఉడుతల సూరన్న, సంగినేని సతీష్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం ఖిలా వరంగల్, శివనగర్ గోడౌన్, ఐనవోలు మండలం పంతిని గ్రామ సెంటర్ లలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టి.యు.సి.ఐ) ఆధ్వర్యంలో కార్మికులు టి.యు.సి.ఐ. జెండా ఎగరవేసి, 139వ మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భగా మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల శ్రమకు తగిన వేతనాలు ,ఉపాధి ,ఉద్యోగ భద్రత లు కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యేయని ఆరోపించారు.దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించి, నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక వర్గానికి తీరని లోటు తలపెట్టారన్నారు.కార్పొరేట్ పెట్టుబడిదారుల ఆర్థిక దోపిడీకి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చారని, కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్న12 గంటలకు పెంచారని, తమ హక్కుల కోసం కార్మిక సంఘాలను పెట్టుకునే హక్కును తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికుల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న అన్ని రంగాల కార్మికుల అభివృద్ధి కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు, కార్మికులంతా చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకై సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీ.నర్సయ్య, మహేందర్, బిక్షపతి, యు.శ్రీను, రాకేష్, కే.సంతోష్, అంకుష్, సాబిరీ కాని మోహన్, రాజన్న, కొమ్మాలు, మురళి, సాగర్, లక్ష్మి, యాకయ్య, సంజీవ, వెంకటేష్, మల్లేశం, రమేష్, కుమార్ ,సాంబరాజు, రవి, కృష్ణ, శివ, సమ్మయ్య, ప్రభాకర్, నరసింహ, బాబు, చంద్రమౌళి, ఎల్లస్వామి, హరీష్, సందీప్, నేరటి రాజు, మల్లేష్,రంజిత్, సంతోష్, దేవేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.